SONG 01
యుధుల రాజ శరోను రోజా
Yudhula Raja Sharonu Roja
Telugu
యుధుల రాజ శరోను రోజా
నీ నామము గొప్పది
సరిపోల్చ లేని దైవము నీవు
నీ నామము ఉన్నతం
Chorus
పాడెదన్ నా యేసుకై
నే జీవించు చివరి శ్వాస వరకు
చాటేదన్ నీ సత్యమును
నే బ్రతుకు దియనముల్ ముగిసే వరకు
Verse 2
సైన్యముల అధిపతి
బలమైన నామము
పాడెదన్ పరిశుద్ధూని
అగ్ని గుండము కాల్చలేదు
యేసు నాకుండగా
Bridge
నీ ప్రసన్నతతో నన్ను నడిపి
నీ మార్గము చూపుము
నీ మహిమ నాకు కనపరాచి
నీ విజయము నిమ్ము
Roman Lyrics
Yudhula Raja Sharonu Roja
Nee Naamamu Gopadhi
Saripolcha leni dhaivamu neevu
Nee naamamu Unnatham
Chorus
Paadedhan Na Yesukai
Ney jeevinchu chivari svasa varakku
Chaatedhan nee sathyamunu
Ney brathuku dhianamul mugisey varaku
Verse 2
Sainyamula adhipathi
Balamaina naamamu
Paadedhan Parishudhuni
Agni Gundamu kaalchaledhu
Yesu nakundaga
Bridge
Nee prasannathatho nanny nadipi
Nee margamu choopumu
Nee mahima naaku kanaparachi
Nee vijayamu nimmu
SONG 02
నా బలముగా క్రీస్తు
Na Balamuga Kreesthu
Lyrics
నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము.. నాకు లేదు
నా కుడి ప్రక్కనా.. యేసు తోడుండగా
నేను జయం పొంది లేచేదను
ఎల్ షద్దాయ్ నా దైవమే..
ఎల్ రొయి నా తండ్రివే..
యెహోవా నా.. రాజువే.. (2)
యెహోవా నిస్సిగా లేచి నిలిచీ
శత్రువుని తరిమి జయమిచ్చిరే (2)
నా కన్నీటి లోయలోనా
వేడుకను సృష్టించవే
మండుతున్న కొలిమిలో విసరబడి
కాలకుండ కరగకుండ రక్షించిరే (2)
యెహోవా దైవం అని
ఉత్సాహంతో కోలిచేదన్
నా యెహోవా దైవం అని
చప్పట్లతో కోలిచేదన్
నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము.. నాకు లేదు
నా కుడి ప్రక్కనా..యేసు తోడుండగా
నేను జయం పొంది లేచేదను.
ఎల్ షద్దాయ్....
ఎల్ రొయ్....
యెహోవా....
SONG 03
Teri Stuti Prashansa Ho
Teri Har Pal Mahima Ho
Opening
Teri Stuti Prashansa Ho,
Teri Har Pal Mahima Ho (X2)
Chorus
Tu Avarnit Hai, Tu Sundar Hai,
Mera Pehla Pehla Pyaar Hai (X2)
Teri Stuti Prashansa Ho,
Teri Har Pal Mahima Ho (2)
Verse 1
Meri Niraashaon Mein
Meri Aasha Bana Tu
Meri Khamoshiyon Ko
Samjha Tune Prabhu (X2)
Teri Stuti Prashansa Ho,
Teri Har Pal Mahima Ho (2)
Chorus
Tu Avarnit Hai, Tu Sundar Hai,
Mera Pehla Pehla Pyaar Hai (2)
Verse 2
Dil Ki Gehraaiyon Mein
Basta Tu Hee Prabhu
Teri Ichchhaon Ko Main
Poora Karata Chalu (X2)
SONG 04
నీటిపైనా నడిచెను
Neeti Painaa Nadichenu
Opening
నీటిపైనా నడిచెను
గాలి సముద్రమును గద్దించెను
మృత్యుంజయుడై లేచెను
నాతో నిత్యము జీవించును-2
Chorus
ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2
Verse 1
1.మనకొరకు మరణించి
సిలువలో ప్రాణమునిచ్చెను
జయశీలుడై లేచెను
పాపికి విడుదలనిచ్చెను-2
ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2
Verse 2
2.మేఘాల మధ్యలో
బూర ధ్వని శబ్దముతో
రారాజుగా దిగివచ్చును
ఈ భూలోకమును ఏలుటకై-2
ఆయనే అధికారముతో యేసయ్యా
ఆయనే రాజ్యమేలుటకు యేసయ్యా
ఆయనే న్యాయాధిపతి యేసయ్యా-4
ఆయనే కాపాడు దేవుడు
ఆయనే నడిపించే దేవుడు
ఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2
Roman Lyrics
Neeti Painaa Nadichenu - Gaali Samudramunu Gaddinchenu
Mruthyunjayudu Lechenu Naatho Nithyamu Jeevinchunu-2
Aayaney Kaapaadu Devudu - Aayaney Nadipinche Devudu
Aayaney Thodaiyundu Devudu Aayaney-2
1.Mana Korakai Maraninchi - Siluvalo Praanamunichenu
Jayasheeludai Lechenu Paapiki Vidudhalanichenu-2
Aayaney Kaapaadu Devudu - Aayaney Nadipinche Devudu
Aayaney Thodaiyundu Devudu Aayaney-2
2.Meghamula Madhyalo - Boora Dhwani Shabdamutho
Raaraajugaa Digivachunu Ee Bhulokamunu Elutakai-2
Aayaney Adhikaaramutoa Yeasayyaa - Aayaney RaajyamealuTaku Yeasayyaa
Aayaney Nyaayaadhipati Yeasayyaa-4
Aayaney Kaapaadu Devudu
Aayaney Nadipinche Devudu
Aayaney Thodaiyundu Devudu Aayaney-2
SONG 05
యెహోవా రాఫా
Yehova Rapha
Verse 1
1. యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు
వ్యాధులింక నాకు లేదే
యెహోవా రాఫా నా బలమాయనే
తెగులు రోగము నాకు లేదే
సిలువలో నాకై ప్రాణము ఇచ్చెను
ఐగుప్తు రోగము నాకు లేదే
మరణము జయించి జీవముతో లేచెను
మరణ భయము నాకు లేదే
నిన్ను నమ్మువారికి భయము లేదే
నిన్ను వెదకు వారికి కొరత లేదే
Verse 2
2. యెహోవా షాలోం సమాధానమిచ్చువాడు
చేయి పట్టి నన్ను నడిపించును
యెహోవా రూహ్ నా మంచి కాపరి
శాంతి జలముల చెంత నడిపించును
యెహోవా యిరే అన్నియు ఇచ్చువాడు
పొషించుటకు శక్తుడాయనే
ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు
నూరంతలుగా నింపి వేయునే
నిన్ను నమ్మువారికి భయము లేదే
నిన్ను వెదకు వారికి కొరత లేదే
Bridge
యేసయ్యా నా నమ్మకము నీవే
యేసయ్యా నా ఆశ్రయము నీవే
SONG 06
నా నీతి సూర్యుడా
Na Neeti Suryuda
Opening
నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని
నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని
రాజులకే మహారాజువు – కృప చూపే దేవుడవు
నిడిపించే నజరేయూడ – కాపాడే కపరివి
నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని
రాజులకే మహారాజువు – కృప చూపే దేవుడవు
నిడిపించే నజరేయూడ – కాపాడే కపరివి
Verse 1
1. శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించేను
వాక్యమే కృపావక్యమే – నను వీడని అంబంధమై
శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించేను
వాక్యమే కృపావక్యమే – నను వీడని అంబంధమై
ని మాటలే జలధరలై – సంప్తృప్తి నిచ్చెను
ని మాటలే ఔషదమై – గాయములు కట్టెను
నీ మాటే మధురం …
రాజులకే మహారాజువు – కృపాచూపే దేవుడవు
నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి
నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని
Verse 2
2.మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు
ఏదియు కోడువచేయవు నిన్నశ్రయించినా వారికి
మేలుకై సమస్తమును -జరిగించుచున్నావు నీవు
ఏదియు కోడువచేయవు నిన్నశ్రయించినా వారికి
భీకరమైన కార్యములు చేయుచున్నవాడా
సజీవుడావై అధికస్తోత్రము పొందుచున్నవాడా
ఘనపరతును నిన్నే …..
ప్రేమించే యెసయ్యా నివుంటే చలునయ్యా
నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి
నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని
Verse 3
3. సంఘమై నీ స్వాస్థ్యమై –
నన్ను ని యెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో – నన్ను
ముద్రించియున్నావు నీవు
సంఘమై నీ స్వాస్థ్యమై –
నన్ను ని యెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో – నన్ను
ముద్రించియున్నావు నీవు
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
తిదిశ్వాస నీ సన్నిదిలో విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా ……
కరుణించే యెసయ్యా నీ కోసమే నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే ఆ క్షణం రావాలయ్య
నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని
రాజులకే మహారాజువు – కృపాచూపే దేవుడవు
నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి….
SONG 07
బంగారం అడుగలేదు
Bangaram Adugaleedu
Opening / Chorus
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా ||2||
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా ||2||
నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా (2) ||నా యేసయ్యా||
నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||
Verse 1
1. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా ||2||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా ||2|| ||నా యేసయ్యా||
నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా (2) ||నా యేసయ్యా||
Verse 2
2. రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్య్రమొందాడయ్యా ||2||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా ||2|| ||నా యేసయ్యా||
నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా (2) ||నా యేసయ్యా||